వినాయకపురంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు

అశ్వరావుపేట, సెప్టెంబర్ 17( జనం సాక్షి) అశ్వరావుపేట మండల లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. వినాయకపురంలోని విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముచ్చర్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జెండాను ఆవిష్కరించారు. మద్దిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిర్రం వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మారుతి లలిత,సంఘ నాయకులు సోమలింగాచారి, వెంకట రత్నాచారి, శ్రీరాముల ఈ చానందాచారి ఆలయ అర్చకులు శ్రీరాముల నిరంజన్ శ్రీరాముల సోమశేఖర్ ఉలవలపూడి రాంబాబు శ్రీ గల సత్యనారాయణ శ్రీ రాముల వెంకటరత్నచారి శ్రీనివాస చారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు