వినాయక చవితి మండపాల వద్ద డిజెలకి
పరిమిషన్ లేదు..
నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు..
త్రీటౌన్ సిఐ భాను ప్రకాష్
ఫోటో ; డీజే నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్న త్రీటౌన్ సీఐ..
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 26( జనం సాక్షి):
సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాల వద్ద డిజెలు పెట్టడానికి ఎటువంటి అనుమతులు లేవని త్రీటౌన్ సిఐ భాను ప్రకాష్ తెలిపారు. శుక్రవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీజే నిర్వాహకులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వినాయక మండపాల వద్ద మరియు నిమజ్జనం సమయంలో డీజే లు పెట్టవద్దని సూచించారు. విగ్రహాల దగ్గర బాక్స టైప్ స్పీకర్లను మాత్రమే వాడాలని ముందుగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు స్పీకర్లను మాత్రమే వాడాలని, స్పీకర్ సౌండ్ మోతాదులో నే ఉండాలని, లౌడ్ స్పీకర్లు విద్యాలయాలకు, ఆసుపత్రులకు, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు ప్రార్థన మందిరాలకు, ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదన్నారు. షాపు యజమానులు నిబంధనలు ఉల్లంఘించి డీజే లు పెడితే సీజ్ చేసి సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో షాపు యజమానులు మరియు ఆపరేటర్లు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.