వినాయక చవితి సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పీస్ కమిటీ

  • గద్వాల ఆర్ సి. (జనం సాక్షి)
    ఆగస్ట్ 26,
    జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ లో వినాయక చవితి సందర్భంగా ఎస్పి రంజన్ రతన్ కుమార్ ఆధ్వర్యంలో పిజ్ కమిటీ
    నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పి రంజన్ రతన్ కుమార్ ను మత పెద్దలు, ఎంఐఎం పార్టీ వార్డ్ కౌన్సిలర్ ఇమ్రాన్ నజీర్ పూల మాలలతో సత్కరించారు.ఎస్పి రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా,హిందూ ముస్లిం మత పెద్దలతో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో యువకులతో, ఆన్లైన్ ద్వారా కానీ,టౌన్ పోలీస్ స్టేషన్ లో సంప్రదించి అప్లికేషన్ లను పొందాలని సూచించారు. కచ్చితంగా రాత్రి పూట వినాయకుని విగ్రహం దగ్గర ఇద్దరు వ్యక్తులను వాలంటరీగా ఉండాలని సూచించారు.
    ప్రతి విగ్రహ మండపం వాలంటరీ అన్ని విధాలుగా బాధ్యతలు నియమ
    నిబంధనలతో పాటిస్తూ పుష్కర ఘాట్ల వద్ద ఈత వచ్చే వారిని ఎంపిక చేయాలని అన్నారు. డిజె సౌండ్ సిస్టంతో ఎక్కువ మోతాదులో ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా కానీ మానసికంగా గురి చేయకుండా సంతోషంగా పండగ వాతావరా నాన్ని నిర్వహించాలని కోరారు. బలవంతపు వసూళ్లు కానీ, నియమ నిబంధనలను అతి క్రమిస్తే తగిన చర్యలు తప్పవు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్,
    డీ ఎస్పి రంగస్వామి , సీఐ టౌన్ ఎస్ ఐ,అన్ని మండల పరిధి ఎస్ ఐ లు, మౌలానా అబ్బాస్ ,మౌలానా హకీమ్, మౌలానా ఉస్మాన్,మౌలానా రహీమ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్,మాజీ కౌన్సిలర్ ఇసాక్,డీటీడీసీ నర్సింలు, చంద్ పార్టీ నాయకులు సంఘాల నేతలు మత పెద్దలు పాల్గొన్నారు.