వినోబావే భూములకు పట్టా పాస్ పుస్తకాలు కల్పించాలి

టేకులపల్లి, జూన్ 25( జనం సాక్షి): టేకులపల్లి మండలం లోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల నూట నలభై ఎకరాల వినోబావే భూములకు చెందిన 25 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో గిరిజన రైతులు వినతిపత్రాన్ని అందించారు. 1994లో 303/2/1/195 సర్వే నెంబర్లు గల వినోభావే భూమి 28 మంది గిరిజన రైతులు పొంది ఉన్నారు . ఆ భూమిలో  రైతులు ఒక సంఘంగా ఏర్పడి ఒక్కొక్కరు ఐదు ఎకరాల తో 140 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. వారికి పట్టా పాస్ పుస్తకాలు కల్పించాలని బేతంపూడి సొసైటీ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ ,జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు ఆధ్వర్యంలో ఆ గిరిజన రైతులతో స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా లక్కినేని మాట్లాడుతూ 28 సంవత్సరాలుగా పెట్టుబడి సహాయం అందక గిరిజన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని వారికి తక్షణమే పట్టా పాస్ పుస్తకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చింత పుల్లయ్య. ఎంపీటీసీ వుకే రామకృష్ణ, బేతంపూడి సొసైటీ సీఈఓ ప్రేమ చారి, డి సి ఓ సీనియర్ అసిస్టెంట్ మాయాకుమారి, చింత కృష్ణ ,సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.