విపత్తులను సామాజిక సమస్యలుగా గుర్తించాలి:

మే 29 నాడు దేశరాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 52.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. రాజస్థాన్‌లోని ఫలోడి లో 51 డిగ్రీల సెల్సియస్, హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇంకో ప్రక్క మణిపూర్లో వరదలు. ఇవన్నీ వాతావరణ మార్పులకు ఒక హెచ్చరికలాంటిదనే విషయం తెలుసుకోవాలి.  రాబోయే రోజులలో దేశవ్యాప్తంగా ఎదుర్కోవలసి ఉంటుంది. అధికవేడి, తుపానులు, వరదలు లాంటి వాతావరణ విపత్తులు వచ్చినప్పుడు జనాలు గగ్గోలు పెడతారు. కొన్ని రోజుల తరువాత షరా మామూలే ! ఇలా జరగడానికి మనకందరికీ కారణాలు తెలుసు.
ఆచరణలో పెట్టాలి:
ఇటువంటివి రాకుండా మనం ఏమి చేయాలి ? ఏవి చేయకూడదు ? వీటిని ఎలా పరిష్కరించాలి ? అని ఆలోచించి ఆచరణలో పెట్టాలి. అంతే తప్ప “నవ్వి పోదురు గాక నాకేమీ సిగ్గు” అనే చందాన్న ఉండకూడదు. మనం మన ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధ తీసుకుంటామో అదే శ్రద్ధ పర్యావరణ ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అనేది ప్రకృతికి కూడా వర్తింపజేయాలి. ఎందుకంటే మనం జీవించాలంటే వాతావరణం సహకరించాలి. లేదంటే మన మనుగడకే ప్రమాదం. ముందుగా ఇటువంటి విపత్తులను సామాజిక సమస్యలుగా పరిగణించాలి. విపత్తులు వచ్చిన తరువాత కోట్ల రూపాయలు తక్షణ ఉపశమనం కోసం ఖర్చు పెడతారు. ఈ విపత్తులకు కారణాలు మనకు తెలుసు. అందువలన ముందుగానే మేల్కొని విపత్తులు రాకుండా దీర్ఘకాలిక చర్యలను చేపట్టాలి. దీనివలన భవిష్యత్తులో మనం మంచి ఫలితాలను పొందొచ్చు. ప్రజలకు ముందు అవగాహన పరచాలి. రాజు గారి పాలు – నీరు కథలా కాకుండా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా పర్యావరణం గురించి పనిచేయాలి. ఎవరి సుఖం కొసం వారు చూసుకుంటున్నారు. విపరీతంగా ఎ.సి లు, ఫ్రిజ్లు, ప్లాస్టిక్ లను, విద్యుత్తును విరివిగా వాడేస్తున్నాం. అందరూ అలానే అనుకుంటున్నాం. ప్రకృతి మాత్రం కొంతవరకే భరిస్తుంది. తరువాత తన పనితాను చేసుకుంటుంది. అప్పుడు గోల పెట్టినా ఏమీ చేయలేము. మన పిల్లల భవిష్యత్తు కోసం బాగా చదివిస్తాం. ఆస్తులు కూడబెట్టి ఇస్తాం.కానీ వారు సుఖంగా జీవించాలంటే పర్యావరణం సహకరించాలనే విషయం మర్చిపోతున్నాం. అందువలన అందరూ పర్యావరణం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాలి. పర్యావరణ రక్షణ కోసం మరికొన్ని చర్యలు తీసుకోవాలి. ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపాలి. కాదు లేదంటే మరికొన్ని వైపరీత్యాలు అనుభవించడానికి రెడీగా ఉండాలి.
ఢిల్లీలో అధిక వేడికి కారణం:
ఢిల్లీ లోని అధిక వేడికి కారణాలేమి టో ఒకసారి చూద్దాం. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకు కారణం రాజస్థాన్ నుండి వీస్తున్న వేడి తేమతో కూడిన గాలులు ముందుగా ఢిల్లీ శివార్లను తాకడమే. రాజస్థాన్, హర్యానా నుండి పొడితో కూడిన వెచ్చని గాలులు, హీట్ వేవ్స్ కూడా కారణమే. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అధిక రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడి తరంగాలు పెరుగుతున్నాయి. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో హీట్‌వేవ్ ప్రకటించబడుతుంది.  ఒక స్టేషన్ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలలో కనీసం 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ, తీరప్రాంత స్టేషన్లలో 37 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ, కొండ ప్రాంతాలలో కనీసం 30 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే హీట్ వేవ్స్ గా పరిగణిస్తారు. మనదేశం చాలా కాలంగా హీట్‌వేవ్‌ల బారిన పడింది. గత కొన్ని దశాబ్దాలుగా పెరిగిన వాతావరణ మార్పుల కారణంగా వేడి తరంగాల ప్రభావం కూడా గణనీయంగా పెరిగింది. రాజస్థాన్ , గుజరాత్ ,ఉత్తరప్రదేశ్ , ఢిల్లీ , హర్యానా , పంజాబ్ , మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు హీట్‌వేవ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి.
హీట్‌వేవ్స్ పెరగడానికి సహజ కారణాలుగా అధిక వాతావరణ పీడన వ్యవస్థలు, ఎల్ నినో, లానినొ లాంటి వాతావరణ వైవిధ్యాలు, కరువు, పొడి పరిస్థితులు, గాలి రవాణాలో మార్పులు, భౌగోళిక పరిస్థితులు మొదలైనవి. గ్లోబల్ వార్మింగ్ కూడా అధిక ఉష్ణోగ్రతలుకు కారణం. మానవపరంగా శిలాజ ఇంధనాలను అధికంగా వాడుతున్నారు. అటవీ నిర్మూలన చేస్తున్నారు. ప్లాస్టిక్ లను
వాడుతున్నారు. హరిత వాయువులకు కారకాలైన అనేక ప్రకృతివిరుద్ధ పనులను చేస్తున్నాం. అధిక జనసాంద్రత కలిగిన పట్టణ ప్రాంతాలు, భవనాలు, కాంక్రీటు ఉపరితలాలు ఎక్కువ వేడిని గ్రహించి నిలుపుకుంటాయి. ఇది అధిక ఉష్ణోగ్రతలకు దారితీస్తుంది. సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో హీట్‌వేవ్ ప్రకటించబడుతుంది. ఒక స్టేషన్ యొక్క గరిష్ట ఉష్ణోగ్రత మైదాన ప్రాంతాలలో కనీసం 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ, తీరప్రాంత స్టేషన్లలో 37 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ, కొండ ప్రాంతాలలో కనీసం 30 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే హీట్ వేవ్స్ గా పరిగణిస్తారు. మనదేశం చాలా కాలంగా హీట్‌వేవ్‌ల బారిన పడింది. గత కొన్ని దశాబ్దాలుగా పెరిగిన వాతావరణ మార్పుల కారణంగా వేడి తరంగాల ప్రభావం కూడా గణనీయంగా పెరిగింది. రాజస్థాన్ , గుజరాత్ , ఉత్తరప్రదేశ్ , ఢిల్లీ , హర్యానా , పంజాబ్ , మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు హీట్‌వేవ్‌ల వల్ల ఎక్కువగా ప్రభావితమ వుతున్నాయి. వేగవంతమైన వేడి పెరుగుదల శారీరక అనారోగ్యాలను కలిగిస్తుంది. విద్యుత్ డిమాండ్‌ పెరిగి గ్రిడ్ విఫలం అవడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి. నీటి వనరులపై కూడా దీని ప్రభావం ఉంటుంది. నీటి వనరులు ఎండిపోవడం, వ్యవసాయం, గృహ అవసరాల కోసం నీటి లభ్యత తగ్గడం వలన నీటి వనరుల కోసం పోటీ పెరుగుతుంది. ఇవి కరువుల సంభావ్యతను పెంచుతాయి. సాగునీటికు డిమాండ్ కూడా పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. ఆహార అభద్రతను పెంచుతుంది. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ప్రకృతిలో మరింత తీవ్రంగా ఉండే వేడి తరంగాల పెరుగుదల మానవ ఆరోగ్యంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపి మరణాల సంఖ్యను పెంచుతాయి.
జనక మోహన రావు దుంగ
యం.యస్సీ, బి.యడ్
అధ్యాపకుడు
8247045230