విమలక్కపై కేసులు విరమించుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : అరుణోదయ సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్కపై పెట్టిన  కేసులు తక్షణం విరమించుకోవాలని ఆ సంస్థ జిల్లా కో- కన్వీనర్‌ కాంతయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం నాడు కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్న నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం తగదని అన్నారు. తెలంగాణలోని పది జిల్లాలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు దోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపించారు. వారిని ఈ ప్రాంతం నుంచి పంపించి వేయాలని అనేక ఉద్యమాలను సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా చైతన్యవంతులను చేస్తున్న విమలక్కను అరెస్టు చేయడం దారుణమన్నారు.  విమలక్కపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని 610 జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో తెలంగాణ యునైటెడ్‌ ఫెంట్‌ నాయకులు వెంకటలక్ష్మి, ఆనసూయ తదితరులు పాల్గొన్నారు.