విలీనంతో టెలినార్‌ ఉద్యోగులకు ఉద్వాసన

న్యూఢిల్లీ,మే17(జ‌నం సాక్షి ): ఎయిర్టెల్లో టెలినార్‌ విలీనంతో కొందరు ఉద్యోగాలకు ఎసరు వచ్చింది.  ఈ మేరకుకొందరికి నోటీసలుఉ పంపారు.  ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ఎయిర్‌టెల్‌ కంపెనీ మెయిల్‌ పంపడంతో ఆందోళన మొదలైందని టెలినార్‌ ఉద్యోగి విూడియాకు తెలిపారు. ఈ నెల 14న టెలికం శాఖ ఎయిర్‌టెల్‌- టెలినార్‌ విలీనానికి ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజునుండి టెలినార్‌లో ఉద్యోగులకు షాక్‌ కు గురిచేసే ఇ- మెయిల్స్‌ వచ్చాయి. హెచ్‌ ఆర్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలని ఎయిర్‌ టెల్‌ కోరింది. తదుపరి నిర్ణయంపై సమావేశంలో చర్చించాల్సి ఉందని పేర్కొంది. ఎయిర్‌ టెల్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టెలినార్‌లో ఉన్న ఉద్యోగులందరికీ ఎయిర్‌ టెల్‌లో తగిన ఉద్యోగాలు లేవని స్పష్టం చేసింది. టెలినార్‌కున్న 1,400 మంది ఉద్యోగుల్లో 700 మందిని సర్దుబాటు చేసుకున్నట్టు తెలిపింది. దీంతో మరో 700 మందిని తీసివేస్తున్నట్లు అంగీకరించింది. విలీనం అనంతరం తమ బాధ్యతలకు తగ్గ ఉద్యోగం లేదన్నారని, ఐదు నెలల వేతనం ఇస్తామని, రాజీనామా చేయాలని కోరినట్లు టెలినార్‌ ఉద్యోగి వెల్లడించారు.