విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి

-నాలుగేళ్లలో కేటీఆర్‌ ఏం చేకాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డిశాడో చెప్పాలి
– కోట్లాది నిధులతో రోడ్లు వేయించింది నేను
– జగిత్యాల నుండే మహాకూటమి జైత్రయాత్రను ప్రారంభిస్తాం

కరీంనగర్‌, అక్టోబర్‌25(జ‌నంసాక్షి) : జగిత్యాల అభివృద్ధి కాకపోవడానికి ముఖ్య కారకుడు మంత్రి కేటీఆర్‌ అని కాంగ్రెస్‌ నేత జీవన్‌ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేటీఆర్‌ గురువారం మాట్లాడుతూ.. 40 సంవత్సరాల నుండి ఏంచేశారు అని ఆనడం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని జీవన్‌రెడ్డి అన్నారు. నువ్‌ నడిచే రోడ్లు ఎక్కడివి అని ప్రశ్నించారు. విూరు నాలుగు సంవత్సరాలలో తట్టెడు మట్టి పోయలేదు అని విమర్శించారు. ఆర్‌అండ్‌బి మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లతో రోడ్లు నిర్మాణం చేశానన్నారు. జగిత్యాల, కరీంనగర్‌ , సిరిసిల్లలలో బై పాస్‌ రోడ్లు వేసింది నేనే అని జీవన్‌ రెడ్డి తెలిపారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఐసీయూ రానీయకుండా కేటీఆర్‌ సిరిసిల్లకు మళ్లించాడని అని మండిపడ్డారు. 2009లో నూకపల్లి అర్బన్‌ కాలనీలో మంజూరు అయిన ఇండ్లను పూర్తి చేస్తే.. జీవన్‌ రెడ్డికి పెరు వస్తుందని చేయట్లేదన్నారు. నాలుగు సంవత్సరాలలో జగిత్యాలకి నువ్‌ ఏమి అభివృద్ధి చేసావో చెప్పు అని కేటీఆర్‌ ను జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు అందరూ ఈ మహాకూటమికి మద్దతు పలుకుతున్నారన్నారు. 4000 వేల కోట్లతో గ్రామగ్రామానికి నీరు అందించొచ్చు.. నువ్‌ మిషన్‌ భగీరథ పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్నవి బయటకు తెస్తామన్నారు. మహాకూటమి అధికారంలోకి రావడంతోనే జగిత్యాలకు 500పడకల హాస్పిటల్‌ కి రూపకల్పన చేస్తామన్నారు. జగిత్యాల నుండే మహాకూటమి జైత్రయాత్ర మొదలు పెడతాం అని జీవన్‌ రెడ్డి తెలిపారు.