వివాహిత దారుణహత్య
సగం కాలిన మృతదేహం గుర్తింపు
నిజామాబాద్,అక్టోబర్5 ( జనం సాక్షి) : జిల్లాలోని మాక్లుర్ మండలం ముల్లంగి గ్రామ శివారులో దారుణం వెలుగుచూసింది. పంట పొలాల్లో వివాహిత మృతదేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. సగానికి పైగా కాలిన దశలో మృతదేహం కనిపించడంతో కొంతమంది రైతులు పోలీసులకు సమాచార మిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వైద్య బృందంతో కలిసి సంఘటనా స్థలికి చేరుకున్నారు. సుమారు (35) ఏండ్ల మహిళను అత్యాచారం చేసి దహనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మక్లూర్ మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో రెండు రోజులుగా వివాహిత మహిళల మిస్సింగ్ కేసు వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.