వివిధ పార్టీలో నుండి టిఆర్ఎస్ చేరిక

జహీరాబాద్ అక్టోబర్ 21( జనంసాక్షి)  మునుగోడు  నియోజకవర్గం, వాయిల పల్లీ  గ్రామంలో మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా, కారు గుర్తుకు ఓటు వేసి, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని, గడప గడపకు వెళుతూ ప్రచారం నిర్వహించిన  జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా గ్రామంలో యువత తో సమావేశం ఏర్పాటు చేశారు గ్రామంలో ని యువత బీజేపీ నాయకులు పలువురు టి ఆర్ ఎస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో  న్యాల్కల్ మండల అద్యక్షులు రవీందర్, జడ్పీటిసి స్వప్న భాస్కర్, మండల ప్రధాన కార్యదర్శి రాజు, బక్కరెడ్డి, ప్రవీణ్ కుమార్, షకీల్ నాయకులు తదితరులు.