విశాఖకేంద్రంగా పారిశ్రామిక హబ్‌ ఏర్పాటు

పరిశ్రమలు పెట్టడానికి సింగిల్‌ డెస్కు విధానం
15వేల కోట్ల పెట్టబడులకు సూయజ్‌కంపెనీ సంసిద్ధత
12వేల కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చిన సన్‌ ఫార్మా
ముంబై సిటి ఇన్వెస్టర్సు కాన్ఫరెన్నసులో ఏపీ సీఎం చంద్రబాబు
ముంబై,మార్చి2(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు సకల
ప్రయాత్నాలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దాదాపు వేయి కిలోవిూటర్ల పొడవైన తీర ప్రాంతం కలిగిన తమ రాష్ట్రంలో అపార ఖనిజ, సహజవాయు నిక్షేపాలున్నట్లు చెప్పారు. విశాఖను పారిశ్రామిక హబ్‌ గా తీర్చిదిద్దుతామని తెలిపరు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేకపోవటం మరో ఆకర్షణీయమైన విషయమన్నారు. సోమవారం ముంబైలో ఏర్పాటైన పారిశ్రామిక వేత్తల రౌండ్‌ టేబుల్‌ కాన్పరెన్స్‌ (సిటి ఇండాయా ఇన్వెస్టర్సు కాన్ఫరెన్సులో) ప్రసంగిస్తూ 24 గంటల విద్యుత్‌ సరఫరాకు కేంద్రం ఎంపిక చేసిన మూడు రాష్టాల్రలో ఆంధ్ర ప్రదేశ్‌ ఒకటని వివరించారు. పెట్టబడులు పెట్టేవారికి ఏపీ స్వర్గధామన్నారు. డెయిరీ,ఫౌల్టీ, సిమెంట్‌, పేపర్‌ పరిశ్రమలలో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే ముందున్నదని వివరించారు. ఫార్మా,బయోటెక్నాలజీ, మెటలర్జీ, ఎలక్టాన్రిక్స్‌,రసాయన పరిశ్రమల రంగాలలో ఏపీ దూసుకెళ్లున్నదని ముఖ్యమంత్రి తెలిపరు. రాష్టాన్న్రి లైఫ్‌ సైన్సెస్‌, ఆటోమొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కులు, మినరల్‌ ప్రాసెసింగ్‌, డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ హబ్‌ గా మారుస్తామని తెలిపారు. ఇండస్టియ్రల్‌ టౌనుషిప్పులు, పెట్రో కెమికల్‌ కాంప్లెక్సులను అభవృద్ది చేస్తామని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు సీఎం చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌ల్‌ పార్కులను, అపేరల్‌ పార్కులను ఏర్పాటు చేస్తామని, ఎలక్టాన్రిక్‌ క్లస్టర్సును ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్రంలొని అన్ని గ్రామాలను ఫైబర్‌ కనెక్టివిటీతో అనుసంధానం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపరు. 2050 నాటికి ప్రపంచ పెట్టబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్‌ నిలవడం ఖాయమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్ర సైబరాబాద్‌ ను అభివృద్ది చేసిన సంగతిని సీఎం గుర్తు చేశారు. హైదరాబాద్‌ ను సాప్ట్‌ వేర్‌ అభివృద్దికి కేంద్రంగా మలిచామన్నారు. ఇదిలా వుంటే సూయజ్‌ ఎనర్టీ ఇంటర్నేషణల్‌ కంపెనీ సీఈవో బెర్నెడ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. గ్యాస్‌, పవర్‌ రంగాలలో అతిపెద్ద కంపెనీగా వున్న తమ కంపెనీ సూయజ్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ లో వివిధ రంగాలలో 15వేల కోట్ల రూపాలయల పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా వుందని ఆయన చెప్పారు. సుజ్లాన్‌ కంపెనీ రాజీవ్‌ శుక్లా చంద్రబాబుతో భేటీ అయ్యారు. సోలార్‌, విండ్‌ ఎనర్జీ సెక్టారులో పెట్టబడులకు సంసిధ్దత వ్యక్తం చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంఎపనీ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ దేవ్‌ భట్టాచార్య ఏపీలో పెట్టబడులకు గల అవకాశాలపై సీఎంతో చర్చించారు. ఇన్‌ఫ్రా,లాజిస్టిక్స్‌,పవర్‌, హౌసింగ్‌ రంగాలలో ఆసక్తిని కనపరిచారు. సన్‌ ఫార్మా ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ సుధీర్‌ వాల్యా సీఎంతో భేటీ అయ్యి పెట్టబడులకు సంసిధ్దత తెలిపారు. 12వేల కోట్ల పెట్టుబడులకు సిద్దంగా వున్నామన్నారు. ఎల్‌ అండ్‌ టి ప్రతినిధి ప్రవీణ్‌, టాటా ఆప్చూనిటీస్‌ ఫండ్‌ ప్రతినిధి పద్మనాభ సిన్హ, బ్లాక్‌ స్టోన్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ మాధ్యూ, కెకెఆర్‌ కృష్ణన్‌, ఐడిఎఫ్‌సి ఎగ్జిక్యూటివ్‌ సతీష్‌, ఫిడెలిటీ వరల్డ్‌ వైడ్‌ సంస్థ తరపున సందీప్‌ కొఠారి, బ్రూక్‌ ఫీల్డ్‌ కంపెనీ పక్షాన అంజురంజన్‌, జిఐసి రియల్‌ ఎస్టేట్‌  సంస్థతరపున కిషక్షర్‌ గొటేటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆటోమొబైల్‌, ఫార్మా, టెక్స్‌టైల్స్‌, సిమెంట్‌ పవర్‌ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి ఆసక్తి ప్రదర్శించారు. పరిశ్రమలు స్థాపించే వారికి 21 రోజుల్లోనే సింగిల్‌ డెస్క్‌ విదానం ద్వారా అన్ని అనుమతులను ఒకే చోట ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి 32వేల ఎకారాలను సవిూకరించామని వివరించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావటానికి సింగపూర్‌, జపాన్‌ ముందుకోచ్చాయని తెలిపారు. విశాఖపట్నం-చెన్నయ్‌ కారిడార్‌ ను అభివృద్ది చేసేందుకు ఏసియన్‌ డెవలప్‌ మెంట్‌ బ్యాంక్‌ ముందుకు వచ్చిందన్నారు.ఏపీని లాజిస్టిక్‌ హబ్‌గా మారుస్తామని  పిపిపి పద్దతిలో భవిష్యత్తులో పది లక్షల ఎకరాలను అభివృద్ది చేస్తామన్నారు.