విశేష సేవలందించిన నారాయణకు సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 1): రాష్ట్ర ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌ పని చేసి పదవి విరమణ చేసిన జె.నారాయణకు జిల్లా అంబేద్కర్‌ సంఘం ఆద్వర్యంలో సన్మానసభను నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్‌ లోకల్‌ఫండ్‌ ఆడిటర్ల జిల్లా సంఘం అధ్యక్షునిగా తెలంగాణ లోకల్‌ఫండ్‌ ఆడిటర్లు ప్రధాన కార్యద ర్శిగా, రాష్ట్ర లోకల్‌ఫండ్‌ ఆడిటర్ల సంఘం కార్యదర్శిగా, ఎస్సీ, ఎస్టీ, లోకల్‌ఫండ్‌ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా నారాయణ విశేష సేవాలందించారని అన్నారు. ఆయన సేవలను గుర్తించి, జిల్లా అంబేద్కర్‌ సంఘం నగరంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో సన్మానించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో దళిత నాయకులు ఎత్తోండ సాయిలు, బాబూరావ్‌ తదితరులు పాల్గొన్నారు.