విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ బంద్ విజయవంతం.

జిల్లా కేంద్రంలో కార్పెంటర్స్ ర్యాలీ.
నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్పెంటర్స్ పని ధరలను పెంచుకుంటాం.
జిల్లా అధ్యక్షులు టి.పాండు చారి.
టౌన్ అధ్యక్షులు ఎస్ ప్రసాద చారి.
 టౌన్ ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి చారి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్13 (జనంసాక్షి):
ప్రస్తుతం పెరుగుతున్న నిత్యవసర ధరలను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా కార్పెంటర్స్ పని ధరలను పెంచాలని విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10,11,12,13 తేదీలలో చేపట్టిన నిరవధిక బంద్ విజయవంతం అయ్యింది.ఈ సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో  ర్యాలీ నిర్వహించడం జరిగింది.
కార్పెంటర్ సంఘాలకు మద్దతుగా నాగర్ కర్నూల్ మేస్త్రి సంఘాలు,బిజినపల్లి, తెలకపల్లి,నాగర్ కర్నూల్  స్వర్ణకార సంఘాలు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ అసోసి యేషన్ జిల్లా అధ్యక్షులు టి.పాండు చారి, నాగర్ కర్నూల్ టౌన్ అధ్యక్షులు ఎస్ ప్రసాద చారి, ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి చారి మాట్లాడుతూ 6 సంవత్సరాల క్రితం ఉన్న ధరలతో ఇప్పటికి అదే ధరకు పనులు చేస్తున్న కారణంగా కార్పెంటర్స్ కుటుంబాలు గడవడమే చాలా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.కావున ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా మా కార్పెంటర్స్ పని ధరలు కూడా పెంచుకునే సమయం ఆసన్నమైంద ని అన్నారు.కావునా జిల్లా ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో  ధరల పట్టికను విడుదల చేయబడునని తెలిపారు.జిల్లాలో పని చేస్తున్న కార్పెంటర్లు ఇప్పటి వరకు అసోసియేషన్ సభ్యత్వం తీసుకోని వారు ఉంటే తొందరగా సభ్యత్వం తీసుకోని అసోసియేషన్ లో సభ్యులుగా చేరాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పెంటర్ అసోసియేషన్ బిజినపల్లి మండల అధ్యక్షులు శ్రీకాంత్, తెలకపల్లి మండల అధ్యక్షులు సురేష్ చారి,మేస్త్రి సంఘాల అధ్యక్షుడు శ్రీను మేస్త్రి, స్వర్ణకార ప్రధాన కార్యదర్శి కొండోజు రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.