వి అర్ ఎ ల డిమాండ్లు పరిష్కరించాలని ఆర్ డి ఓ కు వినతి
జనం సాక్షి ఆర్మూర్ రూరల్ జూలై:-29
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ ల సమస్య ను పరిష్కారం చేసి సమ్మె విరమింప జేయాలని కోరుతూ ప్రగతిశీల యువజన సంఘం పీ వై ఎల్ ఆధ్వర్యంలో ఆర్ డీ ఓ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీ వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ వేదిక గా వీఆర్ఏలలో దళితులు బీసీలు అనగారిన వర్గాలు ఉన్నాయని ప్రభుత్వ ఖజానాపై భారం పడ్డ కూడా వాళ్లకు పేస్కేల్ అమలు చేస్తామని వారసత్వ ఉద్యోగాల కల్పనలో పెన్షన్లలో న్యాయం చేస్తామని సుమారు ఏడాదిన్నర గడిచిపోయిన నేటికీ వారి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని దీంతో వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధనకై పోరాటబాట పట్టారని అన్నారు.
వీఆర్వో వ్యవస్థ రద్దు తో పని భారం మీద పడినా కూడా పని చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువచేసేందుకు నిరంతరం కృషి చేసిన వీఆర్ఏ ల పట్ల కేసీఆర్ ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తు ఇచ్చిన హమీలు కూడ అమలు చేయకుండా మరో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల హమీల మాదిరిగా దగా జేయజూస్తున్నదని వారు విమర్శించారు. తక్షణమే వారి డిమాండ్లు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ ఆర్మూర్ మండల కార్యదర్శి తూర్పటి శ్రీనివాస్, నాయకులు కిషోర్ తదితరుల పాల్గొన్నారు.