*వి.ఆర్.ఏల సమ్మెకు బిఎస్పీ పార్టీ కమ్మర్పల్లి మండల కమిటీ తరపున సంఘీభావం*
కమ్మర్పల్లి 30 జులై (జనంసాక్షి)కమ్మర్పల్లి మండలకేంద్రంలో ఆరవ రోజు నిరవధిక సమ్మెకు శనివారం రోజున బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) కమ్మర్పల్లి మండల కమిటీ సంఘీభావం తెలిపారు, ఈ సందర్భంగా బిఎస్పీ మండల అధ్యక్షులు మంద రాజీవ్ దాస్ మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వం వి.ఆర్.ఏ లతో ఎంతో వెట్టిచాకిరి చేయి0చడం సారి కాదని అన్నారు. రాష్ట్రంలో రెవిన్యూ వ్యవస్థకు వెన్నుముక లైనటువంటి వి.ఆర్.ఏ లకు ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పే స్కేల్ అమలు చేయడం, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించడం, ఉద్యోగ విరమణ పొందిన వారికి పింఛను సదుపాయం కల్పించడం, కారుణ్య నియామకాలు చేపట్టడం లాంటి వాటిని వెంటనే నెరవేర్చలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ బాల్కొండ అసెంబ్లీ అధ్యక్షులు గుంటి బెనర్జీ, , కన్వీనర్ లు గంగాధర్ , క్రాంతి అఖిల్ , వీఆర్ఏ అధ్యక్షుడు ద్దుబాక శ్రీకాంత్ సి, ఉపాధ్యక్షుడు బాలచందర్, అన్ని గ్రామాల వీఆర్ఏలు, తదితరులు పాల్గొన్నారు.