వి ఆర్ ఏ లకు అండగా ..బి యస్ పి పార్టీ
మహాదేవపూర్ జులై 29( జనంసాక్షి)
మహాదేవపూర్ మండల కేంద్రంలో గత ఐదు రోజుల నుండి వి ఆర్ ఏ లు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని దీక్ష లు చేస్తున్నారు. వీరికి మద్దతుగా బి యస్ పి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా. ఆర్ యస్ పి ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం రోజున . బి యస్ పి మంథని నియోజకవర్గ ఇంచార్జ్ కందుగుల రాజన్న, నియోజకవర్గ అధ్యక్షులు రామిల్ల రాకేష్, పాలిమేల మండల కన్వీనర్ కలుగురి వెంకట్, కాటారం మండల కన్వీనర్ బొడ్డు రాజబాబు, మండల నాయకులు సురేష్ లు మద్దతు ఇచ్చారు. కందుగుల రాజన్న ,రాకేష్ తదితర నాయకులు మాట్లాడుతు వి ఆర్ ఏ .ల న్యాయమైన డిమాండ్లు వెంటనే అమలు అయ్యేవిదంగా ప్రభుత్వం వెంటనే చేర్యాలు తీసుకోవాలని లేని పక్షంలో బి యస్ పి పార్టీ ఆధ్వర్యంలో. ఉద్యమాలు ఉదృతం చేస్తామని , పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వి ఆర్ ఎ లు మండల అధ్యక్షులు బాలరాజు .నాయకులు మెరుగు సమ్మయ్య. రాజబాపు. శ్రీనివాస్. రాకేష్. మహేందర్. పద్మ తదితరులు ఏ దీక్షలో పాల్గొన్నారు

Attachments area