వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి
*వీఆర్ఏల జిల్లా అధ్యక్షులు భైరబోయిన ఐలేష్,
ఖానాపురం ఆగష్టు 8జనం సాక్షి
రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ముఖ్యమంత్రి కెసిఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు సోమవారం నాటికి 15 రోజులు సమ్మె చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఖానాపురం మండలం వీఆర్ఏ శిబిరానికి సోమవారం జిల్లా అధ్యక్షులుభైరబోయిన ఐలేష్, జేఏసీ చైర్మన్ నరసయ్య,కో చైర్మన్ పూజారిసురేష్, జేఏసీ జనరల్ సెక్రెటరీ బానోతు వీరన్న,జేఏసీ ప్రధాన కార్యదర్శి భాష బోయిన ప్రభాకర్, ఖానాపురం మండల కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలను చిన్నచూపు చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేందర్,ప్రధాన కార్యదర్శి రవికుమార్, గౌరవాధ్యక్షులు సుదర్శన్, వీఆర్ఏలు యాకయ్య,సుధాకర్,మాధవి,సంధ్య,మౌ నిక,రజిత, శీను తదితరులు పాల్గొన్నారు.