వీఆర్ఏలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
జడ్పిటిసి తుమ్మల హరిబాబు
ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 19 (జనం సాక్షి) :-
వీఆర్ఏల నిరవధిక సమ్మె 57వ రోజు చేరుకుంది సోమవారం వీఆర్ఏలకు జడ్పిటిసి తుమ్మల హరిబాబు మద్దతు తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో తప్పకుండా న్యాయం జరుగుతుందని ఇటీవల కాలంలో వీఆర్ఏ రాష్ట్ర నాయకులతో కేటీఆర్ చర్చలు జరిపారని మరోదఫా చర్చలు ఉంటాయని అతికొద్ది రోజుల్లోనే వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ లకు పరిష్కారం చూపిస్తారని వీఆర్ఏలు ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని తెలిపారు కెసిఆర్ ప్రభుత్వంలో ఎవరికి కూడా అన్యాయం జరగదని ప్రతి ఒక్కరూ లాభం పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పత్రి పున్నయ్య, వీఆర్ఏలు సాంబయ్య, రవీందర్, కమలహాసన్, రాజు, లక్ష్మి, సారమ్మ, పాల్గొనడం జరిగింది.