వీఆర్ఏలకు మద్దతుగా టిపిటిఎఫ్ జిల్లా నాయకుల మద్దతు
గంగారం సెప్టెంబర్ 23 (జనం సాక్షి) గంగారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ లు చేస్తున్న61వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యన్నీ తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ పెడరేషన్(టిపిటిఎఫ్) మహబూబాబాద్ జిల్లా శాఖ కండిస్తుంది. న్యాయమైన వారి డిమాండ్లను వెంటనే పరిస్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ స్కేల్ మంజూరు చేయడం, వారసత్వ నియామకాలు కల్పించడం అనేవి కనీస హక్కులుగా టి పి టి ఎఫ్ భావిస్తుంది. ఈ కనీస హక్కులను సాధించుకునే క్రమంలో వీఆర్ఏ ల పోరాట స్పూర్తిని అభినందిస్తున్నాము. వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు చుంచ.శ్రీశైలం, జిల్లా ఉప అధ్యక్షుడు ఎం.సాంబయ్య, శ్రీనివాస్ కొత్తగూడ మండల అధ్యక్షుడు, సూర్యనారాయణ, విద్యాసాగర్ మరియు జి కార్తీక్ జిల్లా కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో గంగారం మండల వీఆర్ఏ లు ఈసం. శ్రీనివాస్, మద్దెల. సమ్మయ్య, దుర్గం. ముత్తయ్య, జనగం. పాపారావు మరియు దుర్గం. సమ్మయ్య పాలుగొన్నారు.