వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలి…….
టేకుమట్ల.ఆగస్టు08(జనంసాక్షి) వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మారపల్లి మల్లేష్ అన్నారు.మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారానికి 15వ రోజుకు చేరింది.ఈ సందర్భంగా ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలైన పే స్కేల్,అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలకు వారసత్వ ఉద్యోగాలు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండలాధ్యక్షుడు బాబు,ప్రధాన కార్యదర్శి స్వామి,జిల్లా జాయింట్ సెక్రెటరీ రవీందర్,జిల్లా కో కన్వీనర్ రజిత,ప్రచార కార్యదర్శులు అప్సర,రమేష్, వీఆర్ఏలు మౌనిక,సందీప్,కిరణ్ మై,రాజు,వీరస్వామి,స్వామి,జితేం దర్ తదితరులు పాల్గొన్నారు.