వీఆర్ఏలకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు
ముస్తాబాద్ జులై జనం సాక్షి
వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఒరగంటి తిరుపతి డిమాండ్ చేశారు తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు గురువారం కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తామని రెండుసార్లు ప్రకటించి మాట తప్పారన్నారు వీఆర్ఏలకు ఒక ఒక తాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ది గారి శ్రీనివాస్ బుర్ర రాములు గౌడ్ డీటి నరసింహులు వీఆర్ఏల మండల అధ్యక్షులు చెక్కపల్లి నర్సింలు బత్తుల శ్రావణ్ వేముల ప్రశాంత్ తలారి నర్సింలు గంధం రాజ్యం సుదర్శన్ విఆర్వోలు కార్యక్రమంలో పాల్గొన్నారు

Attachments area