*వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన మెట్పల్లి బిజెపి నాయకులు
27.07.2022
మెట్పల్లి టౌన్ : జనంసాక్షి
మెట్పల్లిలోని సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు టీఎస్ వీఆర్ఏ జేఏసీ చేస్తున్న నిరవధిక సమ్మెకు మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ మరియు రాష్ట్ర కార్యవర్గసభ్యులు సాంబారి ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది దీనిలో భాగంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారికి పేస్కేలు అమలు చేసి, వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది వీఆర్ఏలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు వారి ఉద్యోగాలు సైతం వదిలిపెట్టుకొని పోరాటం చేశారని అలాంటి వీఆర్ఏలను విస్మరిస్తే ఊరుకునేది లేదని తెలిపారు కాబట్టి వీఆర్ఏల యొక్క సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి జీవో పాస్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు లేని యెడల బిజెపి పోరాటం చేస్తుందని న్యాయం జరిగే వరకూ ఆపేదే లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దొనికెలనవీన్ రాష్ట్ర నాయకురాలు పూదరి అరుణ, ఇల్లందుల కృష్ణమాచారి , జిల్లా ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల శ్రీనివాస్ బిజెపి జిల్లా నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ , ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు జక్కని కుందన్ బీజేవైఎం పట్టణ అధ్యక్షులు ఆర్మూర్ రంజిత్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షురాలు మధ్యల లావణ్య బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు బండారి రమేష్ బిజెపి ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు సుంకే అశోక్ బిజెపి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బైరి అవినాష్ బిజెపి సీనియర్ నాయకులు కొల్లెపుశ్రీనివాస్ తోకల సత్యనారాయణ దేవరాజం వరలక్ష్మి నవీద్ తదితరులు పాల్గొన్నారు