*వీఆర్ఏల దీక్షకు మద్దతుగా.బీఎస్పీ*

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు పిఅర్సి వర్తింప చేస్తామని ప్రకటింపజేసి అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బీఎస్పీ  నాయకులు దక్షిణ తెలంగాణ మైనార్టీ కోఆర్డినేటర్ అబ్రహం,నియోజక వర్గ ఇంఛార్జి రాపోలు నవీన్, ఆరోపించారు.మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు 06వ రోజు దీక్ష సందర్భంగా దీక్షలో కూర్చున్న వీఆర్ఏలకు బీఎస్పీ పట్టణ అధ్యక్షుడు కర్రీ సతీష్ రెడ్డి అధ్వర్యంలో దీక్ష శిబిరాన్ని  సందర్శించి వారి పోరాటానికి సంపూర్ణ మద్దతును పలికారు.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు  మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాగ్దానాలు ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం పరిపాటి అయిందని ఎద్దేవ చేశారు.గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి నేటి వరకు వారిని విధుల్లోకి తీసుకోలేదన్నారు, వీఆర్ఏలకు పిఆర్సి వర్తింపజేయాలని అర్హులైన వీఆర్ఏ లందరికీ పదోన్నతి కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఉపాధ్యక్షుడు జీలకర్ర రామస్వామి, తక్కెల్ల నాగార్జున,శ్రీను, వీఆర్ఏలు మాలోత్ నాగు నాయక్, పెరుమల్ల పిచ్చమ్మ,బుడిగే లక్ష్మి,కోట మణి,శోభ రాణి,ఝాన్సి,రాధ, చంద్రకళ, అంతయ్య, సైధా,అనిల్,ఖాదర్,అప్పయ్య,నాగయ్య,సైదులు తదితరులు ఉన్నారు