వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
రుద్రంగి జూలై 26 ( జనం సాక్షి);
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు చేసున్న దీక్ష న్యాయమైనదనీ వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం ఉమ్మమడి చందుర్తి రుద్రంగి మండలాల,వీఆర్ఏలు దీక్షలో పాల్గొని మాట్లాడుతూూూూూ… ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పేస్కేలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం,పెన్షన్ సౌకర్యం కల్పించాలని వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని,డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల వీఆర్ఏలు రాణవేణిి తిరుపతి, బండి సురేష్, తలారి భూమయ్య,బొమ్మిన రాజలింగంం,సింగం నరేష్్, జమాలుద్దీన్,సింగం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.