వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

భీమదేవరపల్లి మండలం జూలై (29) జనంసాక్షి న్యూస్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏ లు చేస్తున్న దీక్ష న్యాయమైనదని వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నాలుగో రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష గురువారం నాడు భీమదేవరపల్లి మండలంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట  దీక్షలో పాల్గొని వీఆర్ఏల అధ్యక్షుడు పంది సారయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైనది కాదన్నారు ఆర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించాలని 50  సంవత్సరాలు నిండిన వీఆర్ఏల ఉద్యోగ అవకాశం పెన్షన్ సౌకర్యం కల్పించాలని వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో జెట్ రాజు చంటి నిజం కిరణ్ సురేందర్ తిరుపతి రజిని వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు
Attachments area