వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ లు నెరవేర్చాలి
డోర్నకల్ ఆగస్టు 8 జనం సాక్షి:
అరకొర వేతనాలతో స్థానికంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్న వీఆర్ఏల గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పుట్టల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.సోమవారం స్థానిక ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు నల్లగట్ల(బంజర)వెంకన్నతో కలిసి వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్రంలో చిరుఉద్యోగుల అవస్థలు వర్ణనాతీతమన్నారు.అసెంబ్లీలో ప్రకటించిన విధంగా వీఆర్ఏలకు పే స్కేల్ అమలు,
అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు,55ఏళ్లు నిండిన వారికి రిటైర్మెంట్ ఇచ్చి వారి కుటుంబీకుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు సమ్మెకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.కార్యక్రమంలో చిలుకోడు ఎమ్మార్పీఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు నల్లగట్ల రవికుమార్,కాంతారావు,రామారావు తదితరులు పాల్గొన్నారు.