వీఆర్ఏల పోరాటం ఉదృతం చేయాలి- సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య

దోమ సెప్టెంబర్ 1(జనం సాక్షి)
వీఆర్ఏల పే స్కేల్ అమలు చేయాలని, వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని దోమ మండలంలో గత 39 రోజుల నుంచి చేస్తున్న వీఆర్ఏల సమ్మెకు సిపిఎం పరిగి ఏరియా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య మాట్లాడుతూ… గత 39 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తే ప్రభుత్వం స్పందించకుండా మీనా మేషలు లెక్కిస్తుందని అన్నారు. రాబోవు రోజులలో వీఆర్ఏలు పోరాటం ఉదృతం చేయాలని, మండలాల్లో గ్రామాలలో ఎమ్మెల్యేల, మంత్రుల మీటింగ్ లను అడ్డుకొని నిరసన వ్యక్తం చేయాలని, అవసరమైతే రోడ్ల దిగ్బంధం చేయాలని వీఆర్ఏలకు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి వీఆర్ఏల ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు లేకపోతే భవిష్యత్తులో పోరాటం ఉదృతం చేసి ప్రభుత్వాన్ని పతనం అయ్యేంతవరకు పట్టు వీడకుండా పోరాడాలని అట్లయితేనే ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం వస్తదని అన్నారు. అనంతరం వీఆర్ఏ కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వీఆర్ఏలకు సీపీఎం నాయకులు భోజనం వడ్డించడం జరిగింది.వారితో కలిసి సిపిఎం నాయకులు కూడా భోజనం చేయడం జరిగింది.
సీపీఎం మండల నాయకులు ఎహ్. సత్యయ్య తమ సొంత ఖర్చుతో వీఆర్ఏలకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీపీఎం పరిగి,దోమ మండల నాయకులు బసిరెడ్డి, శేఖర్, శీను,కృష్ణ,శీను,నర్సింహా,చెంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.