వీఆర్ఏల సమస్యలు నెరవేర్చాలి…

– పీర్లకు వినతిపత్రం సమర్పించిన ఊరుకొండ మండల వీఆర్ఏలు.
– 16వ రోజు నిరవధిక సమ్మెలో
మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య.
ఊరుకొండ, ఆగస్టు 9 (జనం సాక్షి):
ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, హామీలు అన్ని నెరవేరేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని ఊరుకొండ మండల వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్తయ్య డిమాండ్ చేశారు. మంగళవారం వీఆర్ఏల 16వ రోజు నిరసన దీక్షలో భాగంగా మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ సత్తయ్య మాట్లాడుతూ… వీఆర్ఏ లకు పే స్కేల్ జీవోను వెంటనే చేయాలని, అర్హులైన వారికి ప్రమోషన్స్ కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, మరణించిన వీఆర్ఏల స్థానంలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, వివిధ డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని మొహరం (పీర్ల పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకొని పీర్ల ముందు నిరసన వ్యక్తం చేయడంతో పాటు వినతి పత్రాన్ని సమర్పించారు. మీ ద్వారానైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చేలా చూడాలని విన్నపించారు. కార్యక్రమంలో ఊరుకొండ మండల వీఆర్ఏ జే ఏ సి చైర్మన్ బీ. సత్తయ్య, కో చైర్మన్ బీ.రమేష్ , జెర్నల్ సెక్రటరీ శేఖర్, కన్వినర్ బీ.శ్రీలత, కో కన్వినర్ లు సుల్తాన్. జంగయ్య, దశరథం. యాదయ్య, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.