-->

వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి.

TPCC.కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్వకుంట్ల సుజిత్ రావు
మెట్పల్లి టౌన్ : ఆగస్టు 02 (జనంసాక్షి)
ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని  కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు డివిజన్ పరిధిలోని మల్లాపూర్, ఇబ్రహింపట్నం,మెట్‌పల్లి కి చెందిన వీఆర్ఏలు 9వ రోజు నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుజిత్ రావు మాట్లాడుతూ. వీఆర్ఏలకు
పే స్కేల్ వర్తింపజేయాలని, అర్హత గల వారికి ప్రభుత్వంతో పాటు, 55 సంవత్సరాలు పైబడిన వారి కుటుంబాలలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జేఏసీ చైర్మన్ గోరువంతుల సుధాకర్, కో చైర్మన్ పుర్రె వినోద్, బురం ప్రవీణ్  గంగాధర్ రవి కైలాస్ సతీష్ రాజేందర్ కైలాస్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఖుతుబోద్దిన్ పాషా, కాంగ్రెస్ నాయకులు రుత్రా నారాయణ, కోన రాకేష్, బద్దం శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, శ్రీకాంత్, శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు