వీఆర్ఏ లకు సంఘీభావం తెలిపిన పి డి ఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు
అయిజ,జులై 29 (జనం సాక్షి):
అయిజ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన వీఆర్ఏ జేఏసీ నిరవదిక సమ్మేకు సంఘీభావం తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా సిపిఐ ఎం ఎల్ ప్రజా పంథా జిల్లా నాయకుడు హలీం పాషా,పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి హరీష్, మాట్లాడుతూ వీఅర్ఏల సమస్యలను పరిష్కరించాలని వారికి వెంటనే పే స్కేల్ జీవోను అమలు చేసి 55 సం.రాల వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని అలాగే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు అలాగే వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిడి ఎస్ యు నాయకుడు మహేష్, వీఆర్ఏ మండల అధ్యక్షుడు నాగన్న, కార్యదర్శి వెంకటేషు, రంగస్వామి, బజరన్న, గోకారి నాయుడు, కేసారం, తదితరులు పాల్గొన్నారు.
Attachments area