వీఆర్ఏ ల నిరవాదిక సమ్మెకు మద్దతు తెలిపి బోజన సౌకర్యం ఏర్పాటు చేసిన దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు

దండేపల్లి. జనంసాక్షి.జులై 28 గత నాలుగు రోజుల నుండి వి అర్ ఏ లు వారి న్యాయ బద్దమైన డిమాండ్స్ నెరవేర్చాలని చేస్తున్న నిరవదిక సమ్మెకు మండల కాంగ్రెస్ నాయకులు గురువారం. మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ vra ల ప్రధాన డిమాండ్స్ అయిన పే స్కేల్,వారసత్వ ఉద్యోగాలు,పదోన్నతులు వెంటనే నెరవేర్చాలని అన్నారు.ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో vra లకు పూర్తి మద్దతు తెలిపి ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు.అనంతరం వీరికి బోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి మండల జెడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి,పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శులు అక్కల వెంకటేశ్వర్లు,కంది సతీష్,ఎంపీటీసీ లు ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల దుర్గాప్రసాద్,ఉపసర్పంచ్ దేవ లక్ష్మణ్ చుంచు నగేష్,కమ్మాల రాకేష్, అరేపల్లీ రమేష్,చొప్పదండి రాజేష్, అడే రవి,తదితరులు పాల్గొన్నారు