*వీఆర్ఏ ల పరిస్థితి పై చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు*

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 13,
జనంసాక్షి
70 రోజులకు పైగా జీతాలు లేకుండా దుర్భరమైన జీవితం అనుభవిస్తున్న వీఆర్ఏల పరిస్థితి పై చలించిపోయిన కోరుట్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీ కొమిరెడ్డి రాములు మెట్టుపల్లి పట్టణంలో తనను ఆశ్రయించిన వీ ఆర్ఎ జేఏసీ నాయకులు మరియు ఆరు మండలాల వీఆర్ఏల సమక్షంలో వారి న్యాయమైన డిమాండ్లపై ఈ నెల 3న ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సీసీఎల్ డైరెక్టర్ రజత్ కుమార్ తో మాట్లాడి.. సాధ్యమైనంత తొందరగా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ అధికారులు.. ఇట్టి విషయమై సమస్య పరిష్కారం కోసం హామీ ఇచ్చారన్నారు. అనంతరం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల సమస్యను పరిష్కరించడంలో విఫలమై.. రోజుల తరబడి సమ్మెకు కారకుడైన వీఆర్ఏల జేఏసీ సెక్రటరీ జనరల్ దాదేమియాకు ఫోన్ చేసిన కొమిరెడ్డి రాములు… ఆయనను పదవి నుండి తొలగిస్తానని తీవ్రంగా మందలించి, నా నియోజకవర్గంలోని రెండు మునిసిపాలిటీ పట్టణాలైన కోరుట్ల మెట్పల్లి నుండి రెండు వీఆర్ఏల యూనియన్లు ఏర్పాటుచేసి అధ్యక్షులను జనరల్ సెక్రటరీలను తామే నియమించి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులలో సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం వహించకుండా వాటిని సకాలంలో పరిష్కరించడంలో యూనియన్ జనరల్ సెక్రటరీలదే బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. అనంతరం సుదీర్ఘమైన 70 రోజుల సమ్మెను సుఖాంతం చేసిన ప్రభుత్వానికి, అలాగే ప్రభుత్వానికి సహకరించిన వీఆర్ఏలకు కొమిరెడ్డి రాములు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీ కొమిరెడ్డి కరంచంద్, నాయకులు ఎర్రోళ్ల హనుమాన్లు, యామ రాజయ్య, న్యాయవాది సురభి అశోక్, ఎండి రైసుద్దీన్, కంతి హరి కుమార్, పెంట ప్రణయ్, కాజా అజీమ్, బర్ల అర్జున్, బర్ల వంశీ, ఎండి రజాక్, పొట్ట గోపి, బాసెట్టి హరీష్, చిదుగు కృష్ణ, అజహార్, పల్లికొండ ప్రవీణ్ ,సిద్ధార్థ, బద్రి మహేష్, ఆసిఫ్, సల్మాన్, తాండ్ర నర్సయ్య, చెరుకు సమ్మయ్య, శ్రీనివాస్, ప్రసాద్, సార్ల అంజయ్య, నీలి చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.