*వీఆర్ఏ సమస్యలు న్యాయబద్ధమైనవి- శంషాబాద్ తహసిల్దార్ జనార్దన్ రావు*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి) : వీఆర్ఏలు చేస్తున్న సమ్మె, వాళ్ల సమస్యలు న్యాయాబద్ధమైనవని శంషాబాద్ తహసిల్దార్ జనార్దన్ రావు అన్నారు.
గత 19 రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్న సందర్భంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు చేస్తున్న సమ్మెకు మద్దతు పలికిన తహసిల్దార్ జనార్దన్ రావు.
సమ్మెకు మద్దతు పలికిన తహసిల్దార్ కు రాఖీ పండగ సందర్భంగా రాఖీ కట్టిన మహిళ వీఆర్ఏలు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏలు కూడా కీలకమైన వారిని వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. వీరు చేస్తున్న సమ్మె డిమాండ్లను పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. వీఆర్ఏలు చేస్తున్న సమ్మె న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కారం కొరకు చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే వీళ్ళ సమస్య పరిష్కరిస్తారన్నారు అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ నరేష్, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, వీఆర్ఏలు నరసింహ, జానకిరామ్, పానుగంటి నరసింహ, రవి, సలీం, శివ, రాజు, మల్లేష్, బాబు, కృష్ణ, పాండు, మహేందర్, ఓం ప్రకాష్, కృష్ణ, సురేష్, హేమలత, సంతోషి, మనీల, పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : శంషాబాద్ లో వీఆర్ఏల నిరవధిక దీక్షకు మద్దతు పలికిన తహసిల్దార్ జనార్దన్ రావు.

తాజావార్తలు