వీఆర్ఏ సమ్మెకు మద్దతుగా సీపీఐ

జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 6:
కరీంనగర్ కలెక్టరేట్ ముందు నిరవధిక సమ్మె చేస్తున్న చిగురుమామిడి వీఆర్ఏలకు మద్దతుగా శనివారం సంఘీభావం తెలిపిన సిపిఐ నాయకులు, చిగురుమామిడి మాజీ జెడ్పిటిసి అందె స్వామి, సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి.అనంతరం చిగురుమామిడి మండలం వీఆర్ఏల సంఘం అధ్యక్షులు కూన రాజేందర్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు