,వీడియో గ్రాఫర్స్ మానవపాడు అసోసియోషన్ నూతన కమిటీ ఎన్నిక
మానవపాడు అక్టోబర్ 11 (జనంసాక్షి)మండల కేంద్రంలోని మంగళవారం మానవపాడు ఫోటో ,వీడియో గ్రాఫర్స్ అసోసియోషన్ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు ఎస్.ఎస్.శేఖర్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మానవపాడు మండల అధ్యక్షులుగా రమేష్, ఉపాధ్యక్షులు శంకర్, కార్యవర్గ సభ్యులు నాగేష్ ,సాదిక్, మధు,రమేష్ ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కమిటీలో బాధ్యతగా పనిచేసి గుర్తింపును తెచ్చుకోవాలని జిల్లా అధ్యక్షులు కోరారు.నూతన కమీటీ కి ఎన్నికైన వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి వేణు, ఇటిక్యాల మండలం అధ్యక్షుడు నరసింహయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు కృష్ణంరాజు,కార్యవర్గ సభ్యులు నరసింహ ,శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area