వీ ఆర్ ఏ లకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ఫోటో: తహసిల్దార్ కార్యాలయం కు తాళం వేసి నిరసన తెలుపుతున్న వీఆర్ఏలు
పెన్ పహాడ్ అక్టోబర్ 10 (జనం సాక్షి) : వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమందని వీఆర్ఏ సంఘం మండల అధ్యక్షుడు పఠాన్ జానీ పాషా అన్నారు సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయానికి తాళం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద 78 రోజులుగా నిరవధిక సమ్మె చేపడుతున్న ప్రభుత్వం వీఆర్ఏల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వీఆర్ఏలు తాసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు పోలీసు రంగ ప్రవేశం చేసి తాసిల్దార్ కార్యాలయం తాళం తీయడంతో సిబ్బంది తమ విధులు నిర్వహించారు, ముఖ్యమంత్రి శాసన సభలో వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన అన్నారు పోలీసు బలగాలతో వీఆర్ఏల సమ్మెను అణచివేయాలని చూస్తే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మద్దెల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి మీసాల పద్మ నాగయ్య, జాన్ పాషా, వెంకటయ్య, వెంకన్న, లక్ష్మి, ఎల్లమ్మ, పిచ్చమ్మ, రాజు, ప్రభాకర్, నరసయ్య, యాదగిరి , తదితరులు పాల్గొన్నారు