వీ ఆర్ ఏ ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం:-
మిర్యాలగూడ. జనం సాక్షి
వీ ఆర్ ఏ ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనీ బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్,షెడ్యూలు కులాల ఉద్యోగుల సంక్షేమం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడుగుల శ్రీనివాస్, బి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి రాజు లు అన్నారు. గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మిర్యాలగూడ లోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్ష జరుగుతున్న వీఆర్ఏలకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు రెగ్యులర్ స్కూల్ ఇవ్వాలని, అర్హత ఉన్న వీఆర్ఏలకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఉద్యోగ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని,55 సంవత్సరాల వయసు పైబడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ అనుబంధ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్, మైనార్టీ సంఘం మండల అధ్యక్షులు మహిముద్ మాలమహానాడు సంఘం నాయకులు సైదులు, వీఆర్ఏ సంఘం నాయకులు సైదులు,సురేష్,భాషా, నాగేశ్వరరావు, సతీష్ నాగరాజు శ్రీనివాస్ చంద్రయ్య సలీమా తదితరులు పాల్గొన్నారు.
Attachments area