*వృద్ధాప్య వితంతు వికలాంగుల ఆసరా పింఛన్లు పంపిణీ*

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): మండలంలోని గణపవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 57సంవత్సరాలు నిండిన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల మరియు ఆసరా పింఛన్లు పంపిణీ జరిగినది. గణపవరం గ్రామసర్పంచ్ కొండపల్లి విజయమ్మ చేతుల మీదుగా ఒకొక్కరికి రెండు వేల పదహారు రూపాయల చొప్పున కొత్తగా మంజూరైన 68మందికి  నగదు రూపంగా పంపిణీ చేశారు. వయస్సు మళ్ళిన ఈ దశలో ఈ పింఛను మంజూరు కావటం ఎంతో సంతోషకరమని లబ్ధిదారులు మిఠాయిలుపంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ జితేందర్ రెడ్డి, పోస్టుమాస్టర్ హరిప్రసాద్, వార్డుమెంబర్, రమేష్ మరియు గ్రామపెద్దలు కొండపల్లి నరసింహారావు, కే. సత్య నారాయణ రెడ్డి, గవిని శ్రీనివాస్, కందిబండ సత్యం గ్రామప్రజలు పాల్గొన్నారు.