వృద్ధాశ్రమంలో నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 10(జనం సాక్షి)

 

లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ వారియర్స్ సెక్రటరీ కొండ్రెడ్డి నవీన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం వరంగల్ నగర సమీపంలోని ఎనగందుల వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది వృద్ధులకు నవీన్ రెడ్డి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధుల మధ్య తన జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరశురాములు, డాక్టర్ ఆకారపు రాజగోపాల్, కర్నే రవీందర్, పెసరు నిరంజన్ రెడ్డి, రాంబాబు, పరమేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.