వృద్ధుల సమస్యలపై చాయ్ పే చర్చ నిర్వహించిన అన్వయా
ఖైరతాబాద్: జూన్ 18 (జనం సాక్షి) భారతదేశంలో మొట్టమొదటి, ఒకే ఒక్క ఐఓటీ, ఏఐ సాంకేతికతల ఆధారిత సమగ్రంగా వ్యక్తిగతీకరించిన వృద్ధుల సంరక్షణ వేదిక అన్వయా పెద్ద వయసు వారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను గురించి చర్చించడంతో పాటుగా దానికి తగిన సమస్యలను కనుగొనడంలో భాగంగా ‘అన్వయా ఛాయ్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్బంగా అన్వయా ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పెద్దలను సరిగా చూసుకోకపోవడం అనేది పెద్దలను వేధించడం కిందకే వస్తుందన్నారు. అన్వయా వద్ద మేము భారతదేశాన్ని పెద్దలకు అనుకూలమైన సమాజంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. భారతదేశంలో పెద్దల సంరక్షణకు సంబంధించి విస్తృత శ్రేణి పర్యావరణ వ్యవస్ధను సృష్టించే దిశగా పనిచేస్తున్నామన్నారు. ఆరోగ్య సంరక్షణ, కనీస వసతులను అందించే సంస్ధలతో పాటుగా పెద్దల భావోద్వేగ, ఇతర అవసరాలను సైతం తీర్చగలడం అవసరమని భావిస్తున్నామన్నారు. రిపపెద్దలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన మెరుగుపరచడంతో పాటుగా తగిన పరిష్కారాలను అందించేందుకు మేము చాయ్ పే చర్చ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు.