వెంకటాపూర్ మండలం లోని పంటలను పరిశీలించిన డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శ్రీపాల్

వెంకటాపూర్(రామప్ప)
సెప్టెంబర్15(జనం సాక్షి):-
గురువారం రోజున వెంకటాపూర్ మండలంలోని వెంకటాపూర్,లక్ష్మిదేవిపేట గ్రామాలలో ములుగు డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కే. శ్రీపాల్ మండలంలోని పత్తి, మిరప, వరి పంటలను పరిశీలించారు.ప్రసుతం పత్తి పంట 80-90 రోజుల దశలో ఉంది.కొంత విరామం తర్వాత రాష్ట్రంలో కురుస్తున్న అధిక వర్షాలకు పత్తి పంటలో పారావిల్ట్ గమనించడం జరిగింది. పంట ఎండిపోవడం, ఆకులు రంగులోకి మారి పూత రాలడం జరుగుతుంది. దీని నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు / లీటరు నీటికి  5-7 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచుకారి చేయాలనీ తెలిపారు. పంట త్వరగా కోలుకోవడానికి మల్టికె లేదా యూరియా 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.పచ్చ దోమ నివారణకు డైనోటోవ్వురాన్ 0.3 గ్రాములు/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. లేదా ధయోమిథక్సామ్ 0.2 గ్రాములు/ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ఎం.కల్యాణి,వ్యవసాయ విస్తరణ అధికారి ఎండీ. ఫయాజ్ మరియు రైతులు పాల్గొన్నారు.