*వెంకట్ నారాయణ మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు*

– సిపిఎం జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

మునగాల, అక్టోబర్ 15(జనంసాక్షి): మండలంలోని  నేలమర్రి గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు బచ్చలకూరి వెంకటనారాయణ మృతి సిపిఎం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం అకస్మాత్తుగా మృతి చెందిన నేలమర్రి గ్రామానికి చెందిన పార్టీ నాయకుడు వెంకట్ నారాయణ పార్థివ దేహంపై పూలమాలవేసి జోహార్లు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేలమర్రి  గ్రామంలో ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన కూలి, భూమి పోరాటాలు, ప్రజా ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొనేవారని అన్నారు. కుటుంబ వారసత్వంతో సిపిఎం పార్టీలో సభ్యుడిగా పనిచేస్తూ గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ గా గెలిచి గ్రామాభివృద్ధికి కృషి చేశాడని అన్నారు. సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిగా పనిచేసి పార్టీ ఇచ్చిన పిలుపులను అమలు చేసేవాడిని అన్నారు. గ్రామంలో అమరుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుండి నడిపించినటువంటి వ్యక్తి వెంకటనారాయణ అని అన్నారు. పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ పార్టీ ఎదుగుదల కోసం కృషిచేసిన వెంకటనారాయణ మృతి బాధాకరమని వారి కుటుంబానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. వెంకటనారాయణ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు, నెమ్మాది వెంకటేశ్వర్లు, ఎలుగూరి గోవిందు, కోట గోపి, జే నరసింహారావు, చిన్నపంగి నరసయ్య, వీరబోయిన రవి, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరం వెంకటరెడ్డి, సిఐటియు సూర్యాపేట పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య, సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు బచ్చలకూరి స్వరాజ్యం, షేక్ సైదా, మండల కమిటీ సభ్యులు బట్టుపల్లి ఉపేందర్, మామిడి గోపయ్య, నేలమర్రి సిపిఎం గ్రామశాఖ నాయకులు బట్టుపల్లి సుందరయ్య, కొంపల్లి కోటయ్య, సుధాకర్, రామ్ చరణ్, జీడయ్య, వెంకన్న, గోవర్ధన్, మంగమ్మ, కవిత, రజిత, పార్వతి తదితరులు పాల్గొన్నారు.