వెంకన్నకు కాళోజీ పురస్కారం

2

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 2(జనంసాక్షి): ప్రముఖ రచయిత, గాయకుడు గోరెటి వెంకన్నకు కాళోజీ నారాయణరావు పురస్కారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. పురస్కారంతో పాటు రూ. 1,01,116ల నగదును వెంకన్నకు ప్రభుత్వం అందజేయనుంది. ప్రజాకవి, పద్మభూషణ్‌ కాళోజీ నారాయణరావు జయంతి సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా వెంకన్నను ప్రభుత్వం సన్మానించి పురస్కారాన్ని అందజేయనుంది. గతేడాది సుప్రసిద్ధ రచయిత అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం వరించింది.