వెంటనే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేయాలి మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ వాకిటి శ్రీహరి

మక్తల్, జూలై 04(జనంసాక్షి): పాఠశాలు ప్రారంభమై నేటికీ నెల పూర్తయిన ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు దొరకకపోవడం శోచనీయం అని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ వాకిటి శ్రీహరి అన్నారు
మక్తల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వాకిటి శ్రీహరి (మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్) & రాజుల ఆశిరెడ్డి (మాజీ పిసిసి అధికార ప్రతినిధి) ఆధ్వర్యంలో  MEO కార్యాలయాన్ని ముట్టడించారు ఎంఈఓ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్స్ ప్రారంభమై నేటికీ నెల పూర్తయిన ప్రభుత్వ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు దొరకకపోవడం శోచనీయం అన్నారు విద్యావ్యవస్థను తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు ఉచిత విద్య ,కేజీ టు పీజీ విద్య అందిస్తామని ప్రగల్బాలు పలుకుతూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్య ధోరణి తో వారి జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతున్నారు. ప్రతిరోజు విద్యార్థిని  విద్యార్థులు పాఠశాలకు విధిగా హాజరవుతూ పాఠ్యపుస్తకాలు లేనందున ఉపాధ్యాయులు పాఠాలు చెప్పకుండా స్కూళ్లకు రానటువంటి క్లాసులు జరగనటువంటి వైనాన్ని గత నెల రోజుల నుండి గమనిస్తున్నాం అన్నారు దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది కానీ మన ప్రభుత్వం వారి భవిష్యత్తును స్వార్థ రాజకీయాల కోసం వారి జీవితాలతో ఆటలాడుతుందన్నారు ఇప్పటికి కూడా పాఠశాలలో కరోనా రూల్స్ కు సంబంధించిన విధివిధానాలను ఎక్కడ పాటించడం లేదు తరగతి గదుల పరిశుభ్రత అంశంలో అశ్రద్ధ వహిస్తున్న విద్య వ్యవస్థ అధికారులు చూసి చూడనట్టు ఉన్నారు. త్వరగా ప్రభుత్వ పాఠశాలలో పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరికి పాఠ్యపుస్తకాలు అందించి నాణ్యమైన విద్యను అందించాలని పాఠశాల మరియు తరగతి గదుల పరిశుభ్రతను పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు లేనియెడల విద్యార్థుల భవిష్యత్తు కొరకు వారికి న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని అన్నారు  ఈ కార్యక్రమంలో బి .గణేష్ కుమార్, పట్టణ అధ్యక్షులు A.రవికుమార్, శ్రీనివాసులు, కట్ట వెంకటేష్, బోయ వెంకటేష్, K. నాగేందర్, k.. అంజప్ప, పి.రంజిత్ కుమార్ రెడ్డి, జి .రవికుమార్, కే గోవర్ధన్, వాకిటి శ్యామ్, సుదర్శన్, కున్సీ అన్వర్, బహదూర్, అబ్దుల్ రెహమాన్, మొహమ్మద్, ఫయాజ్, మహమ్మద్, చెన్నయ్య గౌడ్, బోయ నరసింహ,కావలి రాజేందర్, నరసింహారాజు, కృష్ణ, ఓబులేష్, మరాఠీ శీను తదితరులు పాల్గొన్నారు