వెనుకబడిన చేనేత కుటుంబాలను ఆదుకుంటాం

నిరుపేద కుటుంబానికి జిల్లా పద్మశాలి సంఘం చేయూత
ఫోటో రైటప్: చేనేత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్న జిల్లా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాయకులు

చొప్పదండి( సెప్టెంబర్ 13 ,జనం సాక్షి) : వెనుకబడిన చేనేత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్ ప్రధాన కార్యదర్శి వోల్లాల కృష్ణ హరి కోశాధికారి అలుస భద్రయ్య అన్నారు. మండలంలోని పెద్దకుర్మపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూలిన గాజుల రామమ్మ చేనేత కుటుంబం ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో వారి కుటుంబాన్ని జిల్లా పద్మశాలి సంఘం మంగళవారం పరిశీలించింది. రామవ్వ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి జిల్లా పద్మశాలి సంఘం నుండి 20వేల నగదు తోపాటు బియ్యం,నిత్యవసర వస్తువులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత కార్మిక కుటుంబాలు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడ్డాయని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ మంజూరు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ ను కలిసి జిల్లా సంఘం నుండి వినతిపత్రం అందజేస్తామన్నారు. రామమ్మ కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ మంజూరుకు ఎమ్మెల్యేను కోరడం జరుగుతుందన్నారు. జిల్లా సంఘం అని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి వొడ్నాల రవీందర్, ప్రచార కార్యదర్శి మార్త ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు జక్కని ప్రభాకర్, స్వర్గం నర్సయ్య, సుడా డైరెక్టర్ వంగర రవీందర్, జిల్లా నాయకులు యెన్నం మునీందర్, మహేశుని మల్లేశం, మాజీ ఎంపిటిసి గాజంగి అనిత రాములు, మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు రమేష్, మల్లేశం, దండే కృష్ణ, ఎలిగేటి మల్లేశం తదితరులున్నారు..