వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్‌ పార్కు

` రాష్ట్రంలో అత్యుత్తమ ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొచ్చాం
` ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ పరిశ్రమల విస్తరణకు తోడ్పాటు
` టీ కన్సల్ట్‌ సదస్సులో 117 ఒప్పందాలు: ఐటి మంత్రి శ్రీధర్‌ బాబు
హైదరాబాద్‌(జనంసాక్షి):బలహీన వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల కోసం బిక్కి ఏర్పాటు అభినందనీయమని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ఇండస్ట్రీ ఆధ్వర్యంలో టీహబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీధర్‌బాబు పాల్గొని ప్రసంగించారు.’’మా ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతోంది. అత్యుత్తమ ఎంఎస్‌ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. విధానాలను ఆచరణలో పెట్టడమే పెద్ద సవాల్‌. సమ్మిళిత అభివృద్ధి కోసమే మా ప్రభుత్వం కృషి చేస్తోంది. 50 శాతానికి పైగా ఉన్న బీసీ జనాభాకు అనుగుణంగా కార్యక్రమాలుండాలేనేది ప్రభుత్వ అభిమతం. ఉపాధి కులాలవారీగా అందాలనే ఉద్దేశంతో కులగణన చేస్తున్నాం. ఎన్ని సవాళ్లు వచ్చినా అధిగమిస్తున్నాం.సవరణ అవసరం అయితే చట్టాల మార్పు కోసం కేంద్రం సాయం తీసుకుంటాం. బిక్కి ప్రతిపాదనలకు అనుగుణంగా పారిశ్రామిక విధానాల్లో మార్పులు తీసుకొస్తాం. బ్యాంకుల నుంచి రుణాలు, ప్రభుత్వ శాఖల నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తాం. వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేస్తాం. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ పరిశ్రమలు విస్తరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మంత్రి వివరించారు.
టీ కన్సల్ట్‌ సదస్సులో 117 ఒప్పందాలు: ఐటి మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌ బాబు
ఆవిష్కర్తలతో పెట్టుబడుదారులను కలిపే సహకార సదస్సు`2024 లో 117 ఒప్పందాలు కుదరడం అభినందనీయమని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రశించారు. ఆవిష్కర్తలతోపెట్టుబడిదారులతో కలిపే ఈ కార్యక్రమం అభివృద్ధికి నూతన మార్గాలను అన్వేషిండంలో సహాయ పడుతుందని ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు అన్నారు. పాలసీ మేకర్స్‌, ఆవిష్కర్తలు, పరిశ్రమ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సదస్సు ఏర్పాటులో తీవ్రంగా శ్రమించిన టీ కన్సల్ట్‌ సంస్థ వ్యవస్థాపకుడు సందీప్‌ మక్తాల ను ఆయన అభినందించారు. కొత్త ఒప్పందాల వల్ల రాష్ట్రం ఆవిష్కరణల్లో, పారిశ్రామిక ప్రగతిలో ముందు వెళ్తుందని శ్రీధర్‌ బాబు తెలిపారు. సదస్సులో అన్‌ ట్యాప్డ్‌ ఇన్‌ వెస్టర్‌ ప్రోగ్రాం, టీ కన్సల్ట్‌ హెల్త్‌, డాక్టర్స్‌ పూల్‌, టేలెంట్‌ కనెక్ట్‌, ఎంఎస్‌ ఎంఇ పాలసీపై చర్చల వల్ల నూతన ఆవిష్కర్తలు, పెట్టుబడిదారులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఏర్పడిరదని చెప్పారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న ప్రతిభావంతులకు 63 దేశాల్లోని సంస్థలతో అనుసంధానం చేయడం గొప్ప కార్యక్రమమని ఆయన ప్రశంసించారు. ఉద్యోగులను కంపెనీలతో కలపడం, ఐటీ ఉద్యోగులను ఇతర దేశాల్లో అదే రంగంలో ఉన్న ఉద్యోగులతో కనెక్ట్‌ చేయడం ఈ సదస్సు వల్ల సాధ్యమైందని శ్రీధర్‌ బాబు అన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడం టీ కనెక్ట్‌ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. మలేషియా, ఆస్ట్రేలియాలతో విద్యార్థుల మార్పిడి కార్యక్రమాన్ని కూడా ఈ సంస్థ చేపట్టే ప్రయత్నాల్లో ఉందని ఆయన ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్యాక్‌ వర్డ్‌ క్లాసెస్‌ ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (బిఐసిసిఐ) వ్యవస్థాపక అవార్డుల ప్రదానం జరిగింది. సదస్సులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌, మాజీ స్పీకర్‌ మధుసూదనా చారి, బండ ప్రకాశ్‌, మద్యప్రదేశ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, పరిశమల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ సంగా తదితరులు పాల్గొన్నారు.