వెల్మకన్న గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం..
కౌడిపల్లి (జనం సాక్షి).. మండల పరిధిలోని వెల్మకన్న గ్రామంలో సోమవారం రోజున ఉచిత కంటి వైద్య శిభిరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శంకర్ కంటి ఆసుపత్రి అధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిభిరం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉచిత కంటి పరీక్షల కార్యక్రమంలో గ్రామంలోని (60) మంది కంటి పరీక్షలు చేయించుకున్నట్లు సర్పంచ్ రాజేందర్ అన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ మారు మూల గ్రామాలకు సైతం ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు చేస్తున్న శంకర్ కంటి హాస్పిటల్ సిబ్బందిని సర్పంచ్ అభినందించారు.