వెస్టిండీస్ పై ఇంగ్లండ్ ఘనవిజయం

సిడ్నీ: ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా వెస్టిండీస్ తో సోమవారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ 123 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ 22.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.ఇంగ్లండ్ ఓపెనర్లు ఇయాన్ బెల్(35 నాటౌట్),మొయిన్ అలీ(46) పరుగులు చేసి జట్టుకు శుభారంభాన్నిచ్చారు.ఆ తరువాత జేమ్స్ టేలర్(25)పరుగులు చేసి మ్యాచ్ ను ముగించాడు.
అంతకుముందు వెస్టిండీస్ ఆటగాళ్లు పూర్తిగా విఫలమై కేవలం 29.3ఓవర్లలో 122 పరుగులకే చాపచుట్టేశారు. సిమ్మన్స్(45), డ్వాన్ స్మిత్(21)పరుగులు మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోవడంతో వెస్టిండీస్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.