వేద సీడ్స్ వారి సదనంద్ గోల్డ్

రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతుంది.
రివిజనల్ మేనేజర్ బీంసేన్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్28(జనంసాక్షి):

రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ నాణ్యతలో మన్నికలో వేద సీడ్స్ వారి సదనంద్ గోల్డ్, ఎల్లవేళలా ముందుంటుంద ని రివిజనల్ మేనేజర్ బీంసేన్ రెడ్డి అన్నారు.బుధవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని నార్సాయిపల్లి గ్రామంలోని ఎరుక వెంకటయ్య పంట పొలాన్ని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.ఈ సందర్భంగా వేద సీడ్స్ పై నమ్మకం ఉండి సాధనంద్ గోల్డ్ పత్తి విత్తనాలను నాటినా పంట పొలంలో గ్రామ రైతుల సమక్షంలో పరిశీలించారు. కంపెనీ యాజమాన్యం సూచనమేరకు రైతు సాగు చేసిన పద్దతి బాగుందన్నారు,రైతు ఐదు ఎకరాలలో సాగు చేయగా ఒక్కో మొక్క 108 రోజులల్లో 58 నుండి 60 కాయలు ఏపుగా కాశాయని, సదనంద్ గోల్డ్ ఎప్పుడు కూడా రైతును నష్టపరుచలేదన్నారు.పత్తి పంటను సాగుచేసే క్రమంలో వేద సీడ్స్ అందించే విత్తనాలను వేసుకోవచ్చని అన్నారు.భూమి చదును చేసుకునే క్రమం నుండి మందుల పిచికారి మరియు కలుపు తీసే విధానం తదితర అన్నింటికీ వేద సీడ్స్ వారు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారని,రైతు ఆత్మగౌరవంతో బ్రతికెలా ఎదిగేలా పంట దిగుబడి బాగా పెరిగేందుకు సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలన చేస్తూ ఉంటారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఏరియా మేనేజర్ కె.భాస్కర్,జడ్చర్ల ఏరియా మేనేజ ర్ నర్సింహారెడ్డి,సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ హీరసింఘ్,జూనియర్ మార్కెటింగ్ ఆఫీసర్ మొల్గర జగదీశ్వర్,ఈ రైతుకు పత్తి విత్తనాలు అందించిన డీలర్ మహాలక్ష్మి ఫర్టిలైజర్ బాలరాజు, గ్రామ రైతులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.