వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపాలన్నదే లక్ష్యం

కోల్‌కత: దేశ అభివృద్దిలో శాస్త్ర సాంకేతిక రంగానిదే కీలకపాత్ర అని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. భారత వందో వైజ్ఞానిక సదస్సు గురువారం కోల్‌కతలో ప్రారంభమైంది. దీనిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించారు. ఈ సదస్సులో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వ సాంకేతిక విధానాన్ని ప్రకటించారు. 2020నాటికి ఐదు ప్రపంచ వైజ్ఞానిక శక్తుల్లో ఒకటిగా భారత్‌ను నిలపాలన్నదే లక్ష్యమని ప్రధాని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్దిలో శాస్త్ర, సాంకేతిక రంగానిది కీలకపాత్ర అని ధనికులు, పేదల మధ్య అంతరాన్ని తొలగించేందుకు శాస్త్ర సాంకేతిక అభివృద్ది తోడ్పడుతుందని అన్నారు. విజ్ఞాన శాస్త్రన్ని ప్రచారం యేసేందుకు అన్ని చర్యలు తీసుకుం టున్నామన్నారు. శాస్త్ర సాంకేతిక పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు